అమెరికా దేశంలో టెక్ సంస్థలు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటిని ముందుకు నడిపించాలంటే కొత్తగా ఉద్యోగులు, తెలివైనవారు అవసరం. వారిని ఏ దేశాల నుంచి అయినా ఆహ్వానించడానికి అమెరికా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా టాలెంటెడ్ విదేశీయులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అక్రమంగా రావద్దని, అధికారికంగానే రావాలని స్పష్టం చేస్తున్నారు.

హెచ్‌-1బీ వీసాలు ఉన్నవారందరినీ ఆహ్వానిస్తానని ట్రంప్ అంటున్నారు. టెక్ స్టాఫ్‌కు ఎప్పుడూ అమెరికాలో ఉద్యోగాలకు కొదవ ఉండదని స్పష్టం చేస్తున్నారు. అయితే, అక్కడ కంపెనీలు కూడా టాలెంటెడ్ టెక్ ఎక్స్‌పర్ట్స్‌ను తప్పకుండా నియమించుకోవడానికి హెచ్‌-1బీ వీసాలు ఇస్తాయి. మొన్నటి వరకు హెచ్‌-1బీ వీసాలు ఇంజనీర్లు వంటి వారికి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి వారందరికీ కూడా హెచ్‌-1బీ వీసాలు ఇవ్వనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారికి కూడా అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.

ఇప్పటివరకు అమెరికాకు జరిగిన ఒక మైనస్ ఉంది. అదేంటంటే అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి జరగలేదు. చాలా అమెరికన్ కంపెనీలు వేరే దేశాల్లో బ్రాంచ్‌లు పెట్టి అక్కడ ఉత్పత్తులు తయారు చేసేవి. వాటిని అమెరికాకు తీసుకొచ్చుకునేవారు. అలాగే అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. దీనివల్ల అమెరికాకు పెద్దగా సంపద వచ్చేది కాదు.

చైనా, ఆఫ్రికా వంటి దేశాల్లో కంపెనీలు బ్రాంచ్‌లు పెట్టడానికి కారణం ఉంది. అమెరికాలో కూలీల ఖర్చులు చాలా ఎక్కువ. గంటకు కనీసం 10 డాలర్లు వరకు ఇవ్వాలి. అదే చైనా, ఆఫ్రికా లాంటి దేశాల్లో అయితే తక్కువ డబ్బులతోనే ఎక్కువ పని చేయించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ఒక మనిషికి ఇచ్చే డబ్బుతో, ఆ దేశాల్లో పది మందికి ఒకరోజు మొత్తం జీతం ఇవ్వొచ్చు. అందుకే చాలా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడానికి అక్కడికి వెళ్తాయి. అంతేకాదు, అమెరికాలో తయారీ చేయాలంటే రకరకాల రూల్స్, ట్యాక్స్‌లు ఉంటాయి. అవి కూడా కంపెనీలకు ఖర్చు పెంచుతాయి. అందుకే చైనా, ఆఫ్రికా లాంటి దేశాలు కంపెనీలకు తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయాలుగా మారాయి.

మేక్ ఇన్ ఇండియా లాగానే మేక్‌ ఇన్ అమెరికా అనే నినాదాన్ని కూడా ట్రంప్ ఎంచుకున్నారు. అంటే అక్కడే అన్నీ తయారు చేయాలని చూస్తున్నారు. అప్పుడు వారికి మ్యాన్‌ఫోర్స్ అవసరం, అంటే మన లేబర్స్. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన ఇండియన్స్ మాత్రమే కాకుండా, మామూలు చదువులు చదువుకున్నవారు, వారి వారి రంగాలలో బాగా నైపుణ్యం సాధించిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలను ఆశించవచ్చు. త్వరలోనే వీరందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: