అయితే... సాయిరెడ్డితో పాటే రాజీనామా చేస్తానని వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రకటించారని సమాచారం అందుతోంది. దీంతో వైసీపీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే.. ఇలాంటి తరుణంలోనే... రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వివాదస్పద పోస్ట్ పెట్టారు. కష్ట కాలంలో జగన్ ను వదిలేసి వెళతావా అంటూ నిలదీశారు.
వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు...కానీ ఇప్పుడు జగన్ కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో....జగన్ మోహన్ రెడ్డిని వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా దారుణం అంటూ వేణుంబాక విజయసాయిరెడ్డి పై ఫైర్ అయ్యారు. చాలా మంది రాజకీయ నాయకులకు ఇలా చేయడం ఫ్యాషన్ అయిపోయింది ,ఇది ధర్మమా అంటూ తన పోస్ట్ ద్వారా నిలదీశారు టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక అటు ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి X వేదికగా సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాయి రెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయం అంటూ బాంబ్ పేల్చారు. అదే జరిగితే... జగన్ మోహన్ రెడ్డి డిస్ క్వాలిఫై అవడం ఖాయం అన్నారు. పులివెందుల నియోజకవర్గానికి ఉపఎన్నికలు ఖాయం అంటూ పోస్ట్ పెట్టారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. మరి విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై వైఎస్ జగన్ ఇంకా స్పందించలేదు.