జగన్ లేని సమయంలోనే వైసీపీలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దావోస్ నుంచి ఏపీకి పెట్టుబడులు రాలేదనే చర్చ జరుగుతున్న సమయంలో విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు. జగన్ కూతురు దగ్గరకు వెళ్లినప్పుడే సమస్యలా అంటూ వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీకి ఐప్యాక్ ఇస్తున్న సలహాలు పార్టీకి తీరని స్థాయిలో నష్టం కలిగిస్తున్నాయి. అన్నీ మంచి రోజులే అని అనుకుంటున్న సమయంలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తమదే అధికారం అని భావిస్తున్న వైసీపీకి ఒక్కొక్కటిగా ఎదురుదెబ్బలు తగులుతుండటం గమనార్హం. జగన్ దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో పార్టీ మరింత వీక్ అయ్యే ఛాన్స్ ఉంది.
2024 ఫలితాలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. విజయసాయిరెడ్డి వల్లే డిల్లీలో పరిస్థితులు అనుకూలంగా మారాయని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి వైసీపీ వ్యవహారాలకు దూరంగా ఉండటం అంటే పార్టీ దీర్ఘకాలంలో నష్టపోయే అవకాశం అయితే ఉంది. విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ రాబోయే రోజుల్లో పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమికి ధీటైన పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. జగన్ తలచుకుంటే మాత్రమే పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.