ఈనెల 25న కొడాలి నాని వైసీపీకి రిజైన్ చేస్తున్నారని ఆరోగ్య కారణాల దృష్ట రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం ఒక్కసారిగా వైసిపి నేతలను ఆందోళనకు గురి చేసింది. దీనిపైన స్వయంగా కొడాలి నాని స్పందిస్తూ అది ఫేక్ విషయమని క్లారిటీ ఇచ్చారు.. తనమీద జరుగుతున్న వాటిలో ఎలాంటి నిజం లేదని తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడ తను ప్రకటించలేదని తెలిపారు.
అది ఎవరు ఎడిట్ చేసిన న్యూస్ అని దాన్ని ఎవరు నమ్మవద్దంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది కొడాలి నాని. అయితే ఇదంతా కూడా వైసిపి పార్టీకి ఎగైనెస్ట్ గా ఉన్నవారే చేస్తున్నారని పలువురు కార్యకర్తలు వైసిపి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైసీపీ నేతలను, కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయం పైన ఎలాంటి అప్డేట్ లేదని అలాగే నిరుద్యోగులను నిండా ముంచారు అంటూ పలువురు వైసిపి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోంది అంటూ కూడా వాపోతున్నారు.