చైనా తన విజయాలను గొప్పగా చాటుకుంటున్న తీరుపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక, అంతరిక్ష రంగాలలో చైనా చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరంగా, ప్రచార ఆర్భాటంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చైనా ప్రకటనల్లో 30% మాత్రమే నిజాలు ఉంటాయని, మిగిలిన 70% కల్పితాలు లేదా అతిశయోక్తులు అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతరిక్ష రంగంలో చైనా సాధించిన విజయాల గురించి ఘనంగా ప్రకటిస్తున్నా వాటికి సంబంధించిన దృశ్యాలు లేదా ఆధారాలు బహిరంగంగా కనిపించడం లేదు. అమెరికా, రష్యా, భారతదేశం వంటి దేశాలు తమ అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని, దృశ్యాలను పంచుకుంటున్నాయి. కానీ చైనా మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని నిపుణులు అంటున్నారు.

ఇటీవల, చైనా సూర్యుడితో సమానమైన శక్తిని సృష్టించామని, 4 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ వ్యర్థాల రియాక్టర్ ను నిర్మించామని ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనల వెనుక వాస్తవం ఎంతవరకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఇళ్లకు విద్యుత్ అందించడానికి న్యూక్లియర్ ఫ్యూజన్ పై ఆధారపడాలంటే, ముందుగా వీలైనంత వేడిగా, ఎక్కువ కాలం పనిచేసే రియాక్టర్లను తయారు చేయాలని చైనా చెబుతోంది. కానీ, ఈ ప్రకటనలు ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతాయో వేచి చూడాలి.

చైనా తరచుగా ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి వెనుకాడుతుంది. దీంతో, వారి ప్రకటనలను గుడ్డిగా నమ్మాలా వద్దా అనే సందిగ్ధత నెలకొంటోంది. దౌత్యపరమైన సంబంధాల నేపథ్యంలో చైనా ప్రకటనలపై బహిరంగంగా విమర్శలు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో, చైనా చేస్తున్న ప్రకటనల వాస్తవికతను స్వతంత్ర సంస్థలు నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 లేదంటే చైనా చందమామను భూమి మీదకి తీసుకొచ్చి డ్యాన్స్ చేయించాం అని చెప్పినా చెబుతుంది. ప్రపంచంలో తామే గొప్ప అని విర్రవీగుతుంది. ఇకపోతే డ్రాగన్ కంట్రీ వైరస్లను  సృష్టించడం తప్ప దానికి ఏదీ చేత కాదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దేశం అక్కడే వైరస్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలుసుకొని వాటిని శాశ్వతంగా అరికట్టాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: