వైసీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసిపోయింది. తాజాగా.. విజయ సాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి... రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాల్లో ఉండబోనని రిటైర్మెంట్ తీసుకున్నారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విజయసాయిరెడ్డి టార్గెట్ గా చాలా కేసులు నమోదు అయ్యాయి.

 

ముఖ్యంగా భూములు లాక్కున్నారని విజయసాయిరెడ్డి టార్గెట్గా చాలా కేసులు నమోదు అయ్యాయట. ఈ నేపథ్యంలోనే... వైసిపి నేత విజయసాయిరెడ్డిని టిడిపి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అయితే ఈ బాధల నేపథ్యంలో.. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.

 

అయితే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరం కావడంతో.. కూటమి నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. జైలుకు వెళతానని  భయంతో... విజయ్ సాయి రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూటమినేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక పెద్ద రహస్యం ఉందని ఆయన బాంబు పేల్చారు.

 అప్రూవర్గా విజయ సాయి రెడ్డి మారబోతున్నాడని tdp MLC బీటెక్ రవి ఆరోపణలు చేశారు. ఒకవేళ అప్రూవర్ గా విజయ సాయి రెడ్డి మారితే... వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం గ్యారంటీ అని బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు సంబంధించిన అన్ని కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడని... జగన్ ఇరికించేందుకు ఇలా బయటికి వెళ్ళడానికి కూడా ఆయన చెప్పగానే చెప్పారు. అయితే దీనిపై విజయ సాయి రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. తెలిపారు. కేసులకు భయపడలేదని.. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటానని ప్రకటించారు విజయ సాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: