తాను ఇకపై రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. కేసులకు భయపడి.. వెనక్కి తగ్గలేదన్నారు. నేను అలాంటి మనిషిని కాదని తెలిపారు వైసీసీ మాజీ నేత విజయసాయిరెడ్డి. అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. నా లాంటి వాళ్ళు 1000 మంది పార్టీ మారిన.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజాధరణ తగ్గదని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి.
నేను చేసిన ఛాలెంజ్ నేను చేసి చూపిస్తానని... సవాల్ చేశారు. ఎవరు ఉమనైజర్ అనేది మీడియాకు తెలుసు అన్నారు. ఆ విషయంలో ఎవ్వరికీ వదలనని వార్నింగ్ కూడా ఇచ్చారు విజయసాయిరెడ్డి. అబద్దాలు చెప్పకుండా ఈరోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని తెలిపారు. దేశభక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను అందుకే తప్పుకుంటున్నానని వివరించారు. విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యాన్ని ఎవరూ తగ్గించలేదని తెలిపారు.
పదవికి రాజీనామా చేయడం సరికాదని జగన్ అన్నారన్నారు. పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్న అని తెలిపానని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఛానెల్ అప్పట్లోనే పెట్టాలని అనుకున్నట్లు వివరించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదని... వెల్లడించారు. అయితే..విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. త్వరలోనే ఆయన కొత్త చానెల్ ఏర్పాటు చేయబోతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ ప్లాన్ చేయనున్నారట.