వైసిపి కీలక నేత వైయస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు అయినటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్నటి రోజున రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతట ఈ విషయం సంచలనంగా మారింది. ఈ విషయం పైన ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆసక్తికరంగా మారిందట. మరి వాటి గురించి చూద్దాం.


వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తరుణంలో రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పెద్దల సభలో కూడా శరవేగంగా పూర్తి అయ్యింది. విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పైన అటు చంద్రబాబు షర్మిల కూడా స్పందించగా ఈ విషయంలోనే కేతిరెడ్డి ట్విట్ ఆసక్తి కనపరిచేలా కనిపిస్తోంది.. టిడిపి నేతలు కూడా విజయ్ సాయి రెడ్డి పైన కొంతమేరకు నెగిటివ్ గానే ప్రచారం చేస్తున్నారు. మరి కొంతమంది విజయసాయి రెడ్డి నిజంగానే రాజకీయాలకు దూరమయ్యారా లేకపోతే జగన్ వ్యూహంలో భాగమ.. త్వరలోనే బిజెపి పార్టీలోకి చేరే అవకాశం ఉందా అనే విధంగా పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.


అయితే ఈ విషయంలోనే కేతిరెడ్డి తన ట్విట్టర్ నుంచి తెలియజేస్తూ రాజకీయాలలో ఏది అనుకోకుండా జరగదు అంటూ ఒక విషయాన్ని తెలియజేశారు.. ఒకవేళ జరిగితే అది ఆ విధంగా ప్లాన్ చేయబడింది మీరు పందెం కూడా వేయవచ్చు అన్నట్లుగా తెలియజేశారు కేతిరెడ్డి.. దీంతో ఈ ట్వీట్ని సడన్గా రాజకీయాలకు గుడ్ బై చెప్పినటువంటి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలనే పోల్చి చేసినట్లు పలువురు నెటిజన్స్ తెలియజేస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేయబడిందని చర్చ మరొకసారి వైరల్ గా మారుతోంది. మరి దీన్ని బట్టి చూస్తే ఏం జరుగుతుంది ఆ మాస్టర్ ప్లాన్ వెనుక జగన్ హస్తమేంటి అనే విషయం తెలియాలసి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: