ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఎప్పటికప్పుడు సరికొత్త మలుపును తీసుకుంటూ ఉంటాయి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీదే హవా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాయలసీమలోని కడప జిల్లాలో గత కొద్ది రోజులుగా ఫ్లెక్సీ ల వారైతే కొనసాగుతూ ఉన్నది. గతంలో కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవ చేస్తూ ఒక ఫ్లెక్సీ కలకలాన్ని సృష్టించింది.. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలామంది కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా కడపలో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక ఫ్లెక్సీ సంచలనంగా మారింది. మరి ఈ ఫ్లెక్సీలో ఏముంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


కడపలో స్థానిక ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక ఫ్లెక్సీ వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా కలాం గారు  మనకు వచ్చే కలలు నెరవేర్చుకునే వైపుగా అడుగులు వేయాలని వేరే వాళ్ళవి కావు అంటూ రాసుకు వచ్చారు.. అలాగే 21 తో గేమ్ ఛేంజర్ ఎవరు అవ్వరని 50 తీసుకోమని చెప్పిన వినలేదంటూ అందులో ప్రస్తావించడం జరిగింది.. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు దావోస్ కి వెళ్లారు అక్కడ వాళ్లను పట్టించుకునే నాదులే కరువయ్యారని వెల్లడించారు.


కనీసం మీరు వెళ్లిన కూడా నాలుగు కంపెనీలైన అందులో వచ్చేవి ప్రతిపక్షంలో ఉన్న మనకు మంచి పేరు ఉంటుంది  కథ అంటూ ఫ్లెక్సీ కలకలాన్నే రేపుతోంది.. అలాగే జగన్ పేరట మరొక ఫ్లెక్సీ వైరల్ గా మారుతూ జగన్ బ్రాండ్ అంటే ఏదో తెలుసా మీకు అంటూ రెచ్చగొట్టే విధంగా  ఫ్లెక్సీ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఫ్లెక్సీలో గోల ఏంటో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా మాత్రం ఇలాంటి ఫ్లెక్సీలు కడప సరౌండింగ్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ ఫ్లెక్సీలు కడుతున్న వారిని పోలీసులు పట్టుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: