ఆంధ్రప్రదేశ్ గ్రామ, సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. సచివాలయ క్యాటగిరిగా విభజించి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను సైతం ఇతర వాటిలోకి ఉపయోగించుకునే విధంగా ఉత్తరులను జారీ చేసిందట. ముఖ్యంగా సచివాలయాలలో A,B,C కేటగిరీలను కూడా విభజించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ కేటగిరి సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బంది 6 మంది.. బి కేటగిరీలో ఉన్న సచివాలయాలకు 7 మంది సి కేటగిరీలో ఉన్న సచివాలయాలకు 8 మందిని మాత్రమే ఉద్యోగులు ఉంచేలా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులను ఇటీవలే జారీ చేసిందట.


ఈ విషయం విన్న గ్రామ సచివాలయ ,వార్డు సచివాలయ సిబ్బంది సైతం కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు ఈ ఉద్యోగులను కుదింపు చేసే పనిలో ఉన్నట్లు కూటమి ప్రభుత్వం తెలుస్తోంది. కనీసం 2500 మందికి ఒక సచివాలయం ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట.అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా మూడు విభాగాలుగా విభజించేలా నిర్ణయం తీసుకున్నారట. ఇందులో కొంతమందిని మల్టీపర్పస్ ఫంక్షనరిస్, సెక్రటేరియల్ గా టెక్నికల్ ఫంక్షన్ హారిస్ గా విభజిస్తున్నట్లు తెలియజేశారు.

ఉద్యోగుల సంఖ్య తగ్గించడం పట్ల ఉద్యోగ సంఘాల సైతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం నిర్ణయం వల్ల దాదాపుగా 40000 మంది ఉద్యోగులు తగ్గుతారని ఆందోళనను తెలియజేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. మరి వీటి పైన సచివాలయ ఉద్యోగుల సైతం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మంచి చేస్తామని చెప్పినప్పటికీ ఇలా ఉద్యోగుల విషయంలోనే చాలా కఠినంగా వ్యవహరించడంతో కచ్చితంగా ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి విషయాల పైన సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయవలసి ఉన్నది. గతంలో కూడా ఉద్యోగులకు ఇబ్బందులు కలిగించడంతోనే ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: