ఏంటి జగన్ భారతి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా.. ఆ బిజెపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉంది.ఇంతకీ వారి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ  సంచలన విషయాలు బయట పెట్టారు ప్రభుత్వ విప్ బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ఆయన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..విజయసాయిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడు. ఆ అక్రమాల నుండి తప్పించుకోవడానికే రాజకీయాలకు స్వస్తి పలికాడు.A1 గా జగన్ A2గా విజయ సాయి రెడ్డి ఉన్నారు. జగన్ ఎన్నో అక్రమాలు చేశారు.వాటిన్నింటిని విజయసాయిరెడ్డి దగ్గరుండి చూశారు.అలాగే జగన్ విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు రావడం వల్లే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 

వైయస్సార్ గారు డైనోసార్ అయితే జగన్ మొహన్ రెడ్డి పెద్ద బేకార్. విజయసాయిరెడ్డి ఎన్నో చెప్పుకోలేని తప్పులు చేశారు. ఆ తప్పుల నుండి బయటపడదాం అనుకుంటున్నారుకానీ వాటి నుండి అస్సలు తప్పించుకోలేడు. జగన్ లాంటి దరిద్రుడి నుండి దూరంగా ఉండడానికి ఎంతో మంది పార్టీలో విజయసాయిరెడ్డి లాగే ఆలోచిస్తున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఇంకా వైసీపీ పార్టీలో ఎంతోమంది ఉన్నారు. వారందరూ బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. జగన్ చేసే తప్పుల కారణంగా జగన్ కి ఆయన భార్య భారతికి మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయి.

విజయ సాయిరెడ్డి జగన్ చేసే తప్పులన్నీ దగ్గర నుండి చూసి అవి భరించలేక బయటికి వచ్చేసారు. ఏదేమైనా విజయసాయిరెడ్డి బయటికి రావడానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. విజయసాయిరెడ్డి ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా పార్టీ నుండి చాలామంది బయటికి రావాలని చూస్తున్నారు.అలాగే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి వచ్చేసరికి అందులో ఉన్న లీడర్లు అందరూ లండన్ కే వెళ్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ప్రభుత్వ విప్ బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: