అసలు విషయమేమిటంటే, అప్పటికే అమెరికాలో 'ఓకిజం' అనే భావజాలం బలంగా నాటుకుపోయింది. దీని ప్రకారం పిల్లలు పుట్టిన వెంటనే ఆడ, మగ అని చెప్పకుండా పెంచాలి. వాళ్లు ఎదిగే క్రమంలో తమకు నచ్చిన లింగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలట. అంతేకాదు, ఎనిమిదేళ్ల లోపు పిల్లలు లింగ మార్పిడి చేసుకోవాలనుకుంటే కూడా అనుమతించాలనే నిబంధనలు తీసుకొచ్చారు. ఒకవేళ తల్లిదండ్రులు, టీచర్లు అడ్డు చెబితే వాళ్లపై కేసులు పెట్టే దిక్కుమాలిన చట్టాలు కూడా చేశారు. ట్రంప్ రాగానే ఈ విధానాన్నంతా ఒక్కసారిగా రద్దు చేశారు.
అయితే ట్రంప్ ట్రాన్స్‌జెండర్ల విధానాలను వ్యతిరేకించినా అమెరికాలో ఎల్జీబీటీ (LGBT) వ్యక్తులు జీవించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ స్వలింగ వివాహాల విషయంలో మాత్రం అక్కడ ఇంకా చర్చలు, వ్యతిరేకతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో థాయ్‌లాండ్ మాత్రం ఊహించని విధంగా రివర్స్ గేర్ వేసింది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజే వందలాది స్వలింగ జంటలు ఒక్కటయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లోని షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వివాహ వేడుకలో వేలాది మంది ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
పెళ్లికి కొత్త నిర్వచనం ఇస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం పౌరస్మృతిలోని కీలకమైన 1448 నిబంధనను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 1448 స్వలింగ వివాహాలు నమోదయ్యాయి. ఇదింకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఈ విషయంపై అధికార యంత్రాంగాన్ని అభినందించారు. చూస్తుంటే, స్వలింగ వివాహాల విషయంలో థాయ్‌లాండ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా ఉంది.