గత ఏడాది గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కాశిని నెల్లూరు జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించింది న్యాయ స్థానం. అయితే... రిమాండ్ ఖైదీగా వచ్చిన కాశీని బాగా చూసుకునేందుకు, సకల సౌకర్యాలు కల్పించేందుకు ఉదయ్ అనే వ్యక్తి నుంచి 20 వేలు ఫోన్ పే వేయించుకున్నట్లు నెల్లూరు జిల్లా జైల్ సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావు పై ఆరోపణలు వస్తున్నాయి. ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భాస్కర్ అనే ఖైదీ పెరోల్‌పై బయటకు రాగా... మద్యం బాటిల్ తీసుకురావాలంటూ వేధింపులు కూడా చేశాడట నెల్లూరు జిల్లా జైల్ సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావు.
మద్యం బాటిల్ తీసుకుని తన ఇంటి వద్దకు రావాలని భాస్కర్‌ను వేధించిన జైలు సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావు సంభాషణ ఆడియోటేపులు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ తరుణంలోనే...నెల్లూరు జిల్లా జైల్ సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావుపై అధికారులు కన్నేశారు. నెల్లూరు జిల్లా జైల్ సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావును విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు జైళ్ల శాఖ డిఐజి.
భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా జైలు సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావుపై శాఖ పరమైన చర్యలు ఉంటాయా? లేక చేతులు తడుపుకుని తుడిచేసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, హోం మంత్రి ఈ అవినీతి జైల్ సూపరిండెంట్ శ్రీరామ్ రాజారావుపై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.