పేదలకు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో వందల మంది కార్పరేట్ వ్యక్తుల రూ . 10 లక్షల కోట్ల రూపాయలను కాఫీ చేసిందని ఆయన పేర్కొన్నారు . తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బిజెపి పేర్కొనడాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఖండించడం జరిగింది . " ఉచిత విద్యుత్ మరియు మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలను నిలిపివేస్తామని బిజెపి ఇప్పటికే చెప్పింది .
ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే అయితే మీరు ఫ్రీ ఖర్చులను భరించగలరా " అంటూ ప్రజలను అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు . తమ పార్టీ పథకాల వల్ల ఢిల్లీలో ప్రతి ఇంటికి 25 వేల విలువైన లబ్ది అందుతుందని ఆయన చెప్పారు . ఇదిలా ఉంటే .. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా ఎనిమిదవ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి . ఈ ఎన్నికలలో ప్రధాన పోరు ఆప్.. బిజెపి మధ్య ఉండబోతుందని ఇప్పటికే స్పష్టమైంది . మరి ఈ పోరులో ఎవరు గెలవనున్నారో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద కేజ్రీవాల్ అన్నారు .