ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఇవాళ సుప్రీంకోర్టులో వైయస్ జగన్మోహన్ రెడ్డికి... అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులను బదిలీ చేయాలని... గత కొన్ని నెలలుగా... రఘురామకృష్ణం రాజు కోర్టు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే... అక్కడ ఎదురు దెబ్బ తగిలినా కూడా... మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు రఘురామ కృష్ణం రాజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులన్నీ బదిలీ చేయాలని... కొన్ని నెలల కిందటే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును భలే భలే విచారించిన సుప్రీంకోర్టు ఇవాళ... వైయస్ జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ ఇస్తూనే... రఘురామకృష్ణం రాజుకు.. షాక్ ఇచ్చింది. రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్ ను ఇవాళ సుప్రీంకోర్టులో... జస్టిస్ నాగరత్న అలాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ల ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన విచారణ పరిగణలోకి తీసుకొని... తాజాగా తీర్పు ఇచ్చింది ఈ అధిష్టానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై... ఉన్న కేసులను బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది.
అలాగే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని... వేసిన పిటిషన్ కూడా ఉపసంహరించుకునేలా రఘు రామ కృష్ణంరాజుకు సూచనలు చేసింది. దీంతో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు రఘు రామకృష్ణంరాజు. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి అభిమానులు అలాగే వైసిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.