కేంద్ర ప్రభుత్వం గత వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేసింది.  వాటిని పూర్తి చేయడంలో వైసీపీ విఫలమైందన్న బీజేపీ నేతలు విమర్శిస్తుంటారు. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి  వాటి నిర్మాణం పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.  నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించడం, ఇళ్లు మంజూరు చేయడం వంటి వాటితో లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు.


ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం దూకుడు మీద ఉంది. ఎన్నికల హామీలపై దృష్టి సారించి వాటి అమలు దిశగా అడుగులు వేస్తోంది.   అందులో భాగంగా పేదల ఇంటి స్థలాలతో పాటు ఇళ్ల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రవ్యాప్తంగా 1.14 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు.


రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన పేదల ఇళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని నిర్ణయించారు. 1.14 లక్షల మంది లబ్ధిదారులకు వాటిని అందించనున్నారు. సీఎం చంద్రబాబు తణుకు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తారు.


మరోవైపు తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  పట్టణ లబ్ధిదారులకు రెండు సెంట్లు, గ్రామీణ లబ్ధిదారులకు మూడు సెంట్లు చొప్పున స్థలం అందించేందుకు ప్రభుత్వం కసరత్ చేస్తోంది.  ఇళ్ల స్థలాల కోసం విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్రస్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  


ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు 900 కోట్లు విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  జగనన్న కాలనీల స్థానంలో ఎన్టీఆర్ కాలనీలో పేరుతో.. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం సర్వే చేసింది.  గతంలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు కానీ లబ్ధిదారుల వివరాలను అధికారులు,సిబ్బంది సేకరించారు.  అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీకి భారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది.  అందులో భాగంగానే ముందుగా ఇంటి స్థలాల మంజూరు పై ఫోకస్ పెట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: