కూటమిలో భాగంగా మినిస్టర్ నారా లోకేష్ కి సైతం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ గత కొద్ది రోజులుగా టిడిపి నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎలాంటి సభలో పాల్గొన్నా కూడా ఈ విషయాన్ని ప్రమోట్ చేసేలా చాలామంది మాట్లాడారు. ఈ విషయంపైన టిడిపి కూడా సీరియస్గా నిర్ణయం తీసుకొని ఇకమీదట ఎవరు ఈ విషయం మీద మాట్లాడకూడదు అంటూ హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా కూటమి నాయకులలో గందరకోలం నేర్పింది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు నేతలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండగా లోకేష్ కు ఇవ్వాలనడం మంచిది కాదు అంటూ తప్పు పట్టడం జరిగింది.



ఈ విషయం పైన అటు టిడిపి ,జనసేన నేతల మధ్య మాటలు ఉద్యమం కూడా పెరగడం జరిగింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా తనకు ఎలాంటి అధికారాలు వద్దని పదవుల కోసం తాను ఆశించి రాజకీయాల్లోకి రాలేదని తెలియజేశారు. ఇటీవలే నారా లోకేష్ విశాఖలో పర్యటించగా  అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పదవి పైన కామెంట్స్ చేయడం జరిగింది.. తనకు సీఎం పదవి అవసరం లేదని టిడిపి కార్యకర్తగా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తే చాలని తెలియజేశారు.


పార్టీ బలోపేతం కోసమే తాను కృషి చేశానని పార్టీకి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకువచ్చేలా పనిచేయని తెలిపారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లు మాత్రమే కొనసాగాలి అంటూ తెలియజేశారు నారా లోకేష్. అందుకే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను మరొకరికి అప్పగించేలా ఆలోచనలో ఉన్నానంటూ వెల్లడించారు. తాజాగా డిప్యూటీ సీఎం పదవి కూటమిలో అలజడి రేపిన విషయంపై ఇలా ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు అంతర్గతంగా వైరల్ గా మారుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: