ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు పథకాల పైన మాట్లాడుతూ.. బీహార్ కంటే ఏపీ పరిస్థితి చాలా దిగజారిపోయిందని పథకాల అమలుపైన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ముఖ్యంగా విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం వంటి వాటికి కేంద్రం ఇచ్చిన నిధులను మళ్ళించారంటూ వెల్లడించారు.. డబ్బులు ఉంటే పథకాలు అమలు చేస్తామంటూ వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలకు వాస్తవాలు తెలియాలని కూడా తెలిపారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం ,(ఒక్క విద్యార్థికి మాత్రమే)అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఇస్తామంటూ తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవని ప్రజలపై పన్నుల భారం ఉందని.. అలాగే అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ఆలోచిస్తున్నామంటూ తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఎన్నో ఆఫీసులను తాకట్టు పెట్టారని ఆయన ఆ డబ్బులు ఏం చేశారు తెలియదంటూ ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు కొనుగోలు శక్తి తగ్గించారని తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రలతో పోల్చుకుంటే ఏపీ పరిస్థితి చాలా తగ్గిపోయిందని తెలిపారు. ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేస్తామంటూ తెలిపారు సీఎం చంద్రబాబు ఈ విషయాలను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంటూ వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఈ ఏడాది కూడా పథకాలకు స్వస్తి చెప్పినట్టుగానే కనిపిస్తోంది సీఎం చంద్రబాబు.