భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ప్రస్తుతం ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో బిజెపి వర్సెస్ ఆప్ పార్టీల మధ్య మాత్రమే రసవత్తర పోరు  కొనసాగుతోంది. ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రభావితం చూపించడం లేదు. దీంతో బీజేపీ వర్సెస్ ఆప్ మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది.

 అయితే ఇలాంటి నేపథ్యంలో బిజెపి కొత్తగా అడుగులు వేస్తోంది. ఇంతవరకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ.... ఈసారి ఎలాగైనా దేశ రాజధానిలో కాషాయ కండువా ఎగురవేయాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ దాదాపు 15 సంవత్సరాలపాటు పనిచేశారు. అంటే 1998 సంవత్సరం నుంచి 2013 వరకు షీలా దీక్షిత్ హవా కొనసాగింది.  అప్పట్లో ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగేది.


 అయితే షీలా దీక్షిత్ ఆగడాలు భరించలేక... కొత్తగా చీపురు పార్టీకి అధికారం ఇచ్చారు ఢిల్లీ ప్రజలు. ఇక.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ దాదాపు పది సంవత్సరాలపాటు పనిచేశారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మరోసారి అరవింద్ kejriwal గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.  అయితే కాంగ్రెస్ అలాగే ఆప్ పార్టీలను ఇన్ని రోజులు భరించారని... ఒకే ఒక్కసారి తమకు చాన్స్ ఇవ్వాలన్న నినాదంతో బిజెపి ముందుకు వెళ్తోంది. బలహీన వర్గాల ప్రజల వద్దకు వెళ్లి.. వాళ్ల అవసరాలు తీర్చేలా ప్లాన్ చేస్తోంది బిజెపి. ఒకవేళ ఇదే సక్సెస్ అయితే... ఢిల్లీలో బిజెపి అఖండ విజయం గ్యారంటీ అంటున్నారు. ఇది ఇలా ఉండగా... ఇటీవల కాలంలోనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కొన్ని నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఆయనకు క్రేజ్ తగ్గడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: