నిజానికి గతంలోనే బీజేపీకి మంచి ఊపు వచ్చింది. కానీ బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో సీన్ రివర్స్ అయింది. లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చేదేమో, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలిచేది. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైపోయాయని జనాలు అనుకోవడం బీజేపీ ఎదుగుదలకి పెద్ద బ్రేక్ వేసింది. దాన్ని బీజేపీ నేతలు సరిగ్గా కౌంటర్ చేయలేకపోయారు. పైగా వాళ్లలో వాళ్లకి పొసగక కొట్టుకున్నారు. ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి దెబ్బతింది. ఇంకొకరిని నాశనం చేద్దామనుకుని సొంత పార్టీనే నాశనం చేసుకున్నారు.
ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ స్థానాలపై గట్టిగా ఫోకస్ పెట్టింది. అందులో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉన్నాయి. వీటి కోసం అభ్యర్థులను ప్రకటించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌లను కూడా పెట్టేసి ఎన్నికలకి రెడీ అవుతోంది. ఈ ఎన్నికలలో MLC ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ బీజేపీకి తిరుగుండదు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుంది, పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్టవుతుంది. BRSతో కుమ్మక్కయ్యారనే విమర్శలకు చెక్ పెట్టొచ్చు. ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, బీజేపీని సీరియస్‌గా తీసుకుంటారు.
రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందనే సంకేతాలు వెళ్తాయి. ఇది రాబోయే ఎన్నికలకు మంచి ఊపునిస్తుంది, క్యాడర్‌కు బూస్ట్ ఇస్తుంది. మొత్తం మీద, ఎమ్మెల్సీ గెలుపు బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాంగ్రెస్ లాగా ఇది కూడా దూసుకొస్తుందో లేదో మరికొన్ని ఏళ్లలోనే తెలిసిపోతుంది.