ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ దూసుకుపోతోంది. అమెరికాతో పోటీ పడుతూ, అంతరిక్ష రంగంలోనూ టాప్-3లో స్థానం సంపాదించింది. అయితే, ఇప్పుడు చైనా చేస్తున్న పని చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతున్నారు. ఏకంగా సూర్యుడికే పోటీగా మరో సూర్యుడిని సృష్టించే పనిలో పడింది.

ఇంతవరకు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా సాహసం చేయని పనిని చైనా చేసి చూపించింది. మొన్నామధ్య మనం విన్నాం కదా, అణు విద్యుత్ తో సూర్యుడి లాంటి శక్తిని తయారు చేస్తున్నారని. తాజాగా చైనా ఆర్టిఫిషియల్ సన్ లేదా కృత్రిమ సూర్యుడిని సృష్టించి, భూమి మీద ప్రయోగించి చూసింది. అది కూడా ఊహించని స్థాయిలో, ఏకంగా 100 మిలియన్ డిగ్రీల వేడిని 18 నిమిషాల పాటు ఉత్పత్తి చేసింది. వంద మిలియన్ డిగ్రీలంటే మామూలు విషయం కాదు.

ఇంతకీ చైనా ఎందుకు ఇలా చేస్తోందంటే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, సూర్యుడు కనబడకుండా పోయినా... అప్పుడు కూడా వెలుగు, వేడి ఉండేలా చూడడానికే ఈ ప్రయత్నం అంటున్నారు. సూర్యరశ్మి లేకపోతే కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు, పంటలు ఎండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కృత్రిమ సూర్యుడు ఉపయోగపడతాడని భావిస్తున్నారు.

అయితే, కొందరు మాత్రం ఇది అణుబాంబు లాంటిదని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబును చైనా తయారు చేసిందని అనుకోవచ్చు అని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, చైనా సృష్టించిన ఈ కృత్రిమ సూర్యుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. ఇకపోతే గతంలో కూడా చైనా కొన్ని ఊహించని ప్రకృతి సంఘటనలను కృత్రిమంగా సృష్టించి ఆశ్చర్యపరిచింది. మున్ముందు ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూడాలి. ఏ దేశాలు కూడా ఇలా ప్రకృతిని ఇమిటేట్ చేసే ప్రయోగాలు చేయలేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ చేసిన అవి కేవలం ప్రయోజనాల కోసమే ఉండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: