ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మంగళగిరి రూరల్ మండలం బేతపూడి గ్రామంకు చెందిన కల్వకుల్లు దుర్గారావు, రమాదేవి దంపతులు, దుర్గారావు తల్లి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు శివారెడ్డి తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. గతంలో శివారెడ్డి అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని దుర్గారావు చెప్పుకొచ్చారు.
 
తప్పుడు రిజిస్ట్రేషన్ తో తనకు సంబంధించిన స్థలాన్ని సైతం ఆక్రమించారని ఆయన చెప్పుకొచ్చారు. శివారెడ్డి రెండుసార్లు తనపై హత్యాయత్నం కూడా చేశాడని దుర్గారావు అన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రాణ భయంతో విజయవాడకు మకాం మార్చామని దుర్గారావు తెలిపారు.
 
2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత శివారెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి మారారని ఆయన కామెంట్లు చేశారు. తనకు న్యాయం చేయాలని పార్టీ కార్యాలయాన్ని, లోకేశ్ ను కలిశానని అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమపై కక్ష సాధింపు కొనసాగుతోందని దుర్గారావు పేర్కొన్నారు. శివారెడ్డి లాంటి వ్యక్తులను టీడీపీలో చేర్చుకోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
కూటమి సైతం వైసీపీలో అక్రమాలు చేసిన నేతలకు స్థానం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పవచ్చు. కూటమి సర్కార్ సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాల అమలు దిశగా అడుగులు పడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కార్యకర్తలకు తమ వంతు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఐదేళ్ల పాలన అద్భుతంగా ఉంటే మాత్రం కూటమికి భవిష్యత్తులో సైతం తిరుగుండదని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఈ కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.





 
 


మరింత సమాచారం తెలుసుకోండి: