దీంతో పరిటాల శ్రీరామ్ కూడా చేర్చుకోవడానికి జమీర్ తో ఎన్నోసార్లు సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోందట. అయితే దీనిపైన మాత్రం జమీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తన అనుచరులతో బిజెపి పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. చాలా బిజెపి నాయకులతో చర్చలు జరిపి బిజెపిలోకి చేరడంతో టిడిపి కార్యకర్తలు ముందు తమతో చర్చించి ఆ తర్వాత బిజెపి పార్టీలోకి ఎలా వెళ్తారు అంటూ టిడిపి నాయకులు వివాదానికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే జమీర్ తో మాట్లాడేందుకు శ్రీరామ్ అనుచరులు కూడా కొంతమంది జమీర్ ఇంటికి వెళ్లారట. దీంతో వీరు గొడవకే వచ్చారని జమీర్ అనుచరులు వారి పైన దాడికి దిగారట.. కానీ టిడిపి నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే తమ మీద దాడి చేశారని భావించి ఎదురుదాడి దిగడంతో ఈ విషయం తెలిసిన వెంటనే బిజెపి నాయకులు అక్కడ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో బీజేపీ పార్టీలోకి చేరాలనుకునే నాయకులను టిడిపి నేతలు దారుణంగా దాడి చేస్తున్నారంటూ బిజెపి నేతలు ఫైర్ అవుతున్నారు.. దీంతో ధర్మవరంలో నిన్నటి రోజు ఉదయం నుంచి తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయట పోలీసులు రంగంలోకి దిగి అక్కడ పరిస్థితులు సర్దు మునిగేలా చేస్తూ ఉన్న ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయట