తనకు ఉన్న పొలంలో... వ్యవసాయం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు వైసీపీ మాజీ నాయకులు విజయ సాయి రెడ్డి. ఈ మేరకు ఫోటోలు... సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో పొలాల్లో తిరుగుతున్నట్లు విజయసాయిరెడ్డి కనిపించారు. టీ షర్ట్ అలాగే పాయింట్ వేసుకొని... ఫార్మర్ గెటప్ లో కనిపించారు. అలాగే ఓ జీబ్ డ్రైవ్ చేస్తూ... రచ్చ చేశారు విజయ సాయి రెడ్డి. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టగానే... చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
విజయసాయిరెడ్డి ఒక రైతుల లేడని.... హాలీవుడ్ రేంజ్ హీరోలాగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పక్కన ఉన్న జీబు... చాలా ఖరీదైనది. ఖరీదైన జీబ్ లో వ్యవసాయం చేస్తే ఎలా ? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు. ఇక కామెంట్స్ అన్ని పట్టించుకోని విజయసాయిరెడ్డి... రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా ఆనందంగా ఉందని కూడా వివరించారు.
ఇది ఇలా ఉండగా మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయ సాయి రెడ్డి... వైసీపీ పార్టీతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వెంటనే స్పీకర్ కూడా విజయసాయిరెడ్డి రాజీనామా పై ఆమోదముద్ర వేశారు.. ఇక.. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఎంపి స్థానాన్ని కూటమినేతలు దక్కించుకునే ఛాన్స్ ఉంది. విజయసాయిరెడ్డి స్థానంలో కూటమి నుంచి ఏ నాయకుడు వెళ్తాడని దానిపైన కూడా చర్చ జరుగుతోంది. జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ లలో ఎవరో ఒకరికి ఈ పదవి దక్కుతుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పటికే పదవులు ఎక్కువయ్యాయని ఒక భావన ఉందట. అందుకే ఈసారి టిడిపి పార్టీకి ఈ పదవి రాబోదని సమాచారం.