దారి ఖర్చులు కూడా వృధా అయిపోయినట్లు సెటైర్లు పేల్చుతున్నారు. అయితే... చంద్రబాబు అలాగే నారా లోకేష్ పై సెటైర్లు పేల్చుతున్న వైసిపి నేతలకు కౌంటర్ ఇచ్చారు.. మైలవరం టిడిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ పార్టీలో... లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అయ్యారని బాంబు పేల్చారు. గతంలో దావోస్ పర్యటనకు వైఎస్ జగన్ తో పాటు ఏపీ మంత్రులు కూడా వెళ్లినట్లు గుర్తు చేశారు. అప్పుడు ఏపీకి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేదని మండిపడ్డారు.
దామోస్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పబ్జి గేమ్ ఆడుకున్నాడని కూడా సెటైర్ వేశారు వసంత కృష్ణ ప్రసాద్. దావోస్ లో కూడా బజ్జీల బండి కోసం జగన్మోహన్ రెడ్డి వెతికారు అని కూడా చురకలాంటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ మాత్రం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే నిత్యం పనిచేస్తున్నారని కొనియాడారు. మొన్నటి దావోస్ పర్యటనలో కోట్లల్లో పెట్టుబడులు వచ్చాయని.. అవి త్వరలోనే కార్యరూపం దాల్చుతాయని కూడా తెలిపారు.
వాస్తవంగా వసంత కృష్ణ ప్రసాద్ 2019 సంవత్సరంలో వైసీపీ పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఈసారి ఓడిపోతుందని ముందే... ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ కూడా టికెట్ సాధించి... మరోసారి మైలవరం నుంచి మొన్న ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను బండ బూతులు తిట్టారు వసంత కృష్ణ ప్రసాద్. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వైసిపి నేతలను తిడుతున్నారు.