చంద్రబాబుపై జగన్ ప్రభుత్వంలో నమోదు చేసిన కేసులన్నీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాటిని సిబిఐకి అప్పగించాలంటూ వైసిపి సానుభూతిపరుడు బాలయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది .. అలాగే ఆయన తరపు లాయర్ పై సుప్రీంకోర్టు ధర్మాస‌నం ఆగ్రహం వ్యక్తం చేసింది .. ఇలా పనికిమాలిన పిటిషన్లు వేసి వాదించడానికి ఎలా వస్తారు అంటూ కూడా ప్రశ్నించడంతో ఆ లాయర్ పరువు పోయినట్లు అయింది .. కోర్టులో మీరు ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించి ఆ పిటీషన్ల‌ను జస్టిస్ బెల్లా త్రివేది ధర్మారం కొట్టి పడేసింది.


వైసిపి నాయకులు న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు చేయటంలో ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉన్నారు .. వారి పార్టీలో ఉన్న ఎవరో ఒకరి పేరుతో కోర్టులో పిటిషన్లు వేసి వాదనలు జరిగే సమయంలో తమకు కావలసినవన్నీ అక్కడ లాయర్ తో అనిపించి వాటిని ప్రచారం చేస్తూ వైసిపి సోషల్ మీడియా ఎప్పుడు ముందు ఉంటుంది .. ఈ పిటిషన్ల విషయంలో కూడా భిన్నంగానే వేస్తూ ఉంటారు .. ఒకసారి జర్నలిస్ట్ అని చెప్పి ఒకరి పేరుతో ఈ పిటిషన్లు వేస్తారు .. మరోసారి సామాజికవేత్త అంటూ .. మరోసారి నిరుపేద అంటూ ఇలా వేసే పిటిషన్ లోను అత్యంత ఖరీదైన లాయర్లను పెట్టుకుంటూ కోర్టుల‌ చుట్టూ తిరుగుతారు. ఈ పిటిషన్ లాయర్ బాలయ్య పేరు మీద వేశారు .. ఆయన పరువు ఇప్పుడు తోటి లాయర్ల ముందు మంట కలిసింది.


కేసులు పెట్టినప్పుడు తప్పుడు ఆధారాలు సృష్టించినప్పుడు .. కనీసం ఆధారాలు రాకుండా అరెస్ట్ చేసినప్పుడు సిఐడి జగన్ చేతిలో ఉంది .. ఆయన మానసిక  సంతోషం కోసం రాజకీయ లక్ష్యాల కోసం చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి ఇప్పుడు అధికారం మారిన తర్వాత కూడా అదే సిఐడి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం వైసీపీకే దక్కిన అదృష్టం .. ఇప్పుడు మొత్తంగా న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని చంద్రబాబుపై భారీ బురద చల్లాలని వైసీపీ కీలక నేతలు చేసిన ప్రయత్నంలో ఇప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ , హైకోర్టు లాయర్ పరువు గంగపాలు అయింది. ఇప్పటికైనా వైసీపీ ఇలాంటి తప్పుడు కేసులను వదిలి ప్ర‌జ‌ల‌కు ఉమ‌యోగాప‌డే రాజకీయాలు చేయాలని ఆశిద్దాం

మరింత సమాచారం తెలుసుకోండి: