తన మీద జరుగుతున్న ప్రతి విషయము కూడా అవాస్తవమని ముఖ్యంగా తన పార్టీ మారుతానంటున్న ప్రచారం కూడా నిజం కాదంటూ తెలియజేశారు అయోధ్య రామిరెడ్డి.. రాజకీయాల్లో ఒత్తిళ్లు ఉండనే ఉంటాయని ఆ ఒత్తిడి లను తట్టుకొని నిలబడడమే గొప్ప విజయమని తెలియజేశారు.. ఇక విజయ సాయి రెడ్డి వెళ్లిపోవడం ఆయన వ్యక్తిగత విషయమని రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని తెలియజేశారు. వైసిపి ఎమ్మెల్యేల పైన కూడా పార్టీ మారాలని చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. ఇంతటి తోనే అన్ని అయిపోవు కదా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని తెలిపారు.
తమ పార్టీలో అన్ని సరిగ్గా జరిగి ఉండి ఉంటే తాము ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేపట్టే వారిని పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ అంటూ తెలిపారు.. విజయసాయిరెడ్డి లొంగిపోయే రకం కాదని తన అభిప్రాయంగా కూడా తెలియజేయడం జరిగింది అయోధ్య రామిరెడ్డి.. అయితే గత కొంతకాలంగా ఇలా వైసీపీ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు బీజేపీ పార్టీ వైపుగా వెళ్లి అక్కడ కూడా అధికారాన్ని సైతం అనుభవిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నేతలు టిడిపి, జనసేన పార్టీ వైపుకు వెళ్లి అక్కడ తమ హవా చూపించాలని చూస్తూ ఉన్న కూటమి నేతలు ఎదగనివ్వడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి