ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున తాను చెప్పినటువంటి హామీలపైన నెరవేర్చలేనని ఆర్థికంగా ఏపీ స్థిరపడిన తర్వాతే తాను అవన్నీ అమలు చేయగలనని చెప్పారు. దీంతో చాలామంది ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వైసిపి పార్టీకి కూడా నిన్నటి రోజున చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాస్త బూస్ట్ ఇచ్చేలా కనిపించాయి. తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చంద్రబాబు పైన ఫైర్ అవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సెక్స్ హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం పైన చాలానే విమర్శలు చేస్తోంది.


ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యిందంటూ తెలియజేసింది.. సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడినట్టే చంద్రబాబు నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ తెలిపింది.. డబ్బులు ఉంటే పథకాలన్నీ అమలు చేస్తానంటూ చెప్పారు పథకాలు కావాలి అంటే ఆదాయం పెంచాలి.. ఎన్నికల ముందు సంపద సృష్టించి ఇస్తా అని చెప్పారు మిమ్మల్ని నమ్మి అధికారం మీ చేతికి ప్రజలు ఇస్తే వారిని ఎంత ఘోరంగా మోసం చేస్తారా అటు ఫైర్ అయ్యింది.


50 లక్షల మంది అన్నదాతలను వంచించారు 80 లక్షల మంది విద్యార్థులకు సైతం ద్రోహం చేశారు కోటి నర్ర మంది పైగా మహిళలను మోసం చేశారంటూ అలాగే 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యింది షర్మిల. అంతా వైసిపి ప్రభుత్వం విధ్వంసమే అని చెబుతున్నారు ఎన్నికలలో హామీలు ఇచ్చే ముందు ఇది తెలియదా అంటూ ఆమె ప్రశ్నించింది. 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెబుతున్నారు కూటమి గెలిస్తే 100 రోజులలోనే గాడి పెడతానన్నారు తీరా ఓటుతో గెలిచిన తర్వాత హామీలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించామన్నారు మరి పథకాలకు నిధులేవి అంటూ ఆమె ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: