ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి  ఏబీ వెంకటేశ్వరరావుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు వేతనం అలాగే అలైన్సులు... వెంటనే చెల్లించాలని... చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశ్రాంతి ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని కూడా కూటమి ప్రభుత్వం క్రమబద్దీకరించడం జరిగింది.


 ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.... విశ్రాంత ఐపీఎస్  ఏబి వెంకటేశ్వరరావు... జీతం అలాగే అలవెన్స్లు కూడా వెంటనే చెల్లించబోతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... విశ్రాంత ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావును టార్గెట్ చేసినట్లు అప్పట్లో విపరీతంగా వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాడన్న ఆరోపణల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావును ఇబ్బంది పెట్టిందట జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఏబి వెంకటేశ్వరరావును రెండుసార్లు సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ వేటు అప్పట్లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే.


 మొదటిసారిగా 2020 నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ 2022 వరకు మొదటి సారి సస్పెన్షన్ చేయడం జరిగింది. అలాగే రెండవసారి... జూన్ 28 2022 నుంచి 2023 మే వరకు వరకు... విశ్రాంత ఐపీఎస్ అధికారి AB వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ వేటు పడిందని సమాచారం అందుతోంది.  ఈ రెండు సస్పెన్షన్ల కారణంగా ఏవి వెంకటేశ్వరరావు జీతంతో పాటు అలవెన్స్ కూడా కోల్పోయారు. ఆయన సర్వీస్ రోజులు కూడా తగ్గిపోయాయి. అయితే తాజాగా... ఆయన సస్పెన్షన్ లో ఉన్న సమయంలో ఇవ్వాల్సిన జీతం అలాగే అలవెన్సులు కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.


దీంతో ఆ కాలానికి సంబంధించిన జీతం అలాగే అలవెన్స్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి కాపులందరూ  ఏకమై జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఆపాలని ఆయన కోరారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడకూడదని కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై వైసీపీ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: