ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వైసిపి పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలందరూ ఒక్కొక్కరు జారుకుంటున్నారు. కూటమి పార్టీలోకి వెళ్లి అక్కడ పదవులు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వైసిపి పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారు కొంతమంది జనసేనలోకి... అలాగే మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఆర్ కృష్ణయ్య లాంటివారు బిజెపి వైపు మొగ్గు చూపారు.

 ఇక లేటెస్ట్ గా విజయసాయిరెడ్డి కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బిజెపి నుంచి తీవ్ర ఒత్తిడి రావడం కారణంగానే వైసిపికి... రాజీనామా చేశాడట విజయ్ సాయి రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసి బిజెపిలోకి వెళ్లడం ఇష్టం లేకనే పూర్తిగా రాజకీయాలనుంచి విజయసాయిరెడ్డి దూరమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు 11 రాజ్యసభ స్థానాలు ఉంటే... అందులో నలుగురు బయటికి వెళ్లిపోయారు.

 ఇందులో ముగ్గురు.. బయటికి వెళ్లి మళ్లీ పదవులు అనుభవిస్తున్నారు. వైసీపీ పార్టీలో బయటికి వెళ్లిన నేతలను కూటమి పార్టీలు పంచుకుంటున్నాయి.  వైసిపి నుంచి బయటికి వెళ్లిన మోపిదేవి, మస్తాన్ రావు లకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పేశారు.  అటు ఆర్ కృష్ణయ్య... భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి మళ్లీ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. విజయ సాయి రెడ్డి మాత్రం రాజకీయాలకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించారు.

 ప్రస్తుతం ఏడుగురు మాత్రమే రాజ్యసభ సభ్యులు వైసిపి పార్టీకి ఉన్నారు. ఇందులో మరో నలుగురు కూడా బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో నలుగురు వెళితే... బిజెపికి కొందరు అలాగే తెలుగుదేశం లోకి కొందరు వెళ్లే ఛాన్స్ ఉండటం. ఈ లెక్క ప్రకారం వైవి సుబ్బారెడ్డి లాంటి ముగ్గురు ఎంపీలు మాత్రమే జగన్ పార్టీలో ఉండే ఛాన్స్ ఉంది.  మరి దీనిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. అటు.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు కూడా జనసేన పార్టీలోకి వెళ్లారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేసి మరీ కూటమి నేతలకు రప్పించుకుంటున్నారు. దీన్ని ఇకపై.. అయినా జగన్ మోహన్ రెడ్డి కట్టడి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: