గతంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నో బ్యాగ్ డే నిర్వహించాలని ప్రయత్నించాయి .. అవి సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల పలు సమస్యలు కూడా తలెత్తాయి .. వారు అనుకున్న లక్ష్యాలు నెరవేర లేకపోయాయి .. ఇక ఇప్పుడు మంత్రి లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని పక్క ప్రణాళికతో అమలు చేయబోతున్నారు. శనివారం రోజున విద్యార్థులు బ్యాగులు తెచ్చుకోకపోయినా అంతకుమించి వారికి నేర్పించేలా పాఠశాలలో ఓ వినూత్నమైన కార్యక్రమాలకు నిరూప కల్పన చేసి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పాఠశాలలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
పుస్తకాల్లో ఏముంటుంది బట్టీ పట్టమే తప్ప .. వాటిని ప్రాక్టీకల్గా చేయగలిగే సామర్థ్యం వచ్చినప్పుడే పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది .. ఇప్పటికే పిల్లలు పుస్తకాల బరువు సమస్య ఎక్కువగా ఉంది .. ఎంతో సిలబస్ తో పాటు చదువుల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. . వీటిని వీలైనంత త్వరగా నిర్మూలించాలని .. పిల్లలు మెదడు మరింత చురుకుగా మారేలా . నో బ్యాగ్ డే కార్యక్రమాలకు ప్లాన్ చేసి .. ప్రతి శనివారం ఈ కార్యక్రమాలను అమలు చేయబోతున్నారు. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి