కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయగోదావరి, కృష్ణ- గుంటూరు పట్టభద్రుల స్థానాలకు.. నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో... వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాలు, అలాగే మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్... తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా... తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టబద్రుల అభ్యర్థిగా ఆలపాటి  రాజేంద్రప్రసాద్ పేరు ఖరారు అయింది. అలాగే.. ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా... పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను ఫిక్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

 

ప్రస్తుతం ఈ రెండు స్థానాలలో లక్ష్మణరావు అలాగే.. పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. కి ఇద్దరి ఎమ్మెల్సీ పదవీకాలం మార్చ్ 29వ తేదీ వరకు ముగియనుంది. అయితే ఆ లోపు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఏపీలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని.. వైసిపి నేతలను పాకిస్తాన్ ఉగ్రవాదుల తరహాలో అరెస్టు చేస్తున్నారని... వైసిపి అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. కానీ ప్రస్తుతం జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయగోదావరి, కృష్ణ- గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో  పోటీ చేస్తే...  వైసీపీ పార్టీ గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: