RTGS సమావేశంలో ఈ విషయాలను అధికారులు వివరించారట.. ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా సర్వే నిర్వహించగా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారట. దీని ప్రకారం ప్రజలు ఎక్కువగా సూపర్ సెక్స్ హామీలపైనే సీఎం చంద్రబాబుని ప్రశ్నించారట. అలాగే గుంతలు లేని రోడ్లు విషయం పైన అడుగుతున్నారని.. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నామంటూ కూటమి సర్కార్ పైనే ఆశలు పెట్టుకున్నామనే విధంగా తెలుపుతున్నారట. మహిళల పైన జరుగుతున్న అరాచకాల పైన,పింఛన్ల పెంచిన విషయంపై సంతృప్తిగా ఉన్న కానీ కమిషన్లు వంటివి కొట్టడం వంటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారట.
అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం ఇవ్వకపోవడం, బెల్ట్ షాపులు గ్రామాలలో ఏర్పాటు కావడం, ఎమ్మెల్యేల పనితీరు పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాలన్నీ కూడా అంతర్గతంగా సీఎం చంద్రబాబు వద్దకు చేరినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేల పనితీరుల విషయం పైన కూటమి పెద్దలు హెచ్చరించినా కూడా ఎవరు వినడం లేదట. ఇటీవలే కాలంలో గ్రామాలలో కూడా జగన్ పేరు మరింత పెరిగినట్లుగా అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఉద్యోగులు, వాలంటరీ వ్యవస్థ సచివాలయ ఉద్యోగులను తగ్గించడం వంటి వాటిపైన కూడా కొంతమేరకు నెగిటివ్ ఏర్పడినట్లు తెలియజేశారట. మరి సీఎం చంద్రబాబు పేరుతో పాటుగా డిప్యూటీ సీఎం పేరు కూడా ఎక్కువగా వినిపిస్తున్నదట.