ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా రసవత్తంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా చాలా కీలకమైన నేతల పార్టీలను విడడం మరొక పార్టీలో చేరడం వంటివి జరుగుతూ ఉన్నాయి. కూటమి పార్టీ మాత్రం వైసిపి నేతలు కార్యకర్తలని లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రముఖ క్రికెటర్ అయిన అంబాటి రాయుడు పొలిటికల్ జర్నీ మరింత ఆసక్తికరంగా ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తోంది. ఐపీఎల్ తో మంచి స్టార్డం అందుకున్న అంబాటి రాయుడు మొదట వైసీపీ వైపు ఆసక్తి చూపిన ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం కూడా జరిగింది.


అయితే సీటు ఇవ్వకపోవడంతో ఆ తర్వాత మళ్లీ జనసేన పార్టీ వైపుగా వెళ్లి జనసేన పార్టీ క్యాంపెనర్ గా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ఇతర పార్టీ వైపుగా వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చిన అంబాటి రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ ని ఆశించిన అది దక్కకపోవడంతో పవన్ అన్నను సీఎం చేద్దామనే నినాదంతో ఎన్నికలలో అంబటి రాయుడు ట్విట్ ఒక సంచనాలంగా మారిపోయింది.


అయితే ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించి అన్ని వాటిలో పాల్గొన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ జనసేనకు దూరమైనట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎక్కడా కూడా తన ఊసే కనిపించలేదు. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభలలో అంబాటి రాయుడు పాల్గొన్నారు.దేశం కోసం పనిచేసే ఏదైనా పార్టీ ఉందంటే అది బిజెపి పార్టీని అంటూ తెలిపారు. ఇప్పుడు అదే పార్టీ వైపు అంబాటి రాయుడు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడి జనసేనకి మద్దతు పలికిన ఈ క్రికెటర్ ఇప్పుడు జనసేనను వీడి బిజెపి వైపుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అంబాటి రాయుడు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: