ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఆసక్తికర సంఘటనకు తెరలేరు. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు పట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో... ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్... కాళ్లు మొక్కారు ప్రధాని నరేంద్ర మోడీ.
మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లపై బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ పడ్డారు. ఆ తర్వాత వెంటనే అతని పైకి లేపి మూడుసార్లు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ కాళ్లకు నమస్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇదేంటి ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కుతున్నాడు ? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్ళు మొక్కడం ఏంటి? అని అందరూ చర్చించుకునేలా... ప్రధాని నరేంద్ర మోడీ ఎత్తుగడ వేసినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా ఎన్నికల స్టంట్ అని కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం కాబోతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో... 70 స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాక గతంలో 70 స్థానాల్లో ఆప్ 62 స్థానాలు గెలుచుకుంది.