ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవిలో... మార్పు తేవాలని నిర్ణయం తీసుకుందట బిజెపి పార్టీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులుగా.. పురందరేశ్వరి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి టికెట్ దక్కించుకొని విజయం సాధించారు పురందరేశ్వరి. అయితే పురందరేశ్వరి పైన కొంతమంది తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారట.

 

చంద్రబాబు కుటుంబానికి అత్యంత దగ్గర బంధువు కావడంతో ఆమెపై బహిరంగంగానే సోమ వీర్రాజు లాంటి నేతలు విమర్శలు చేస్తున్నారు. అందుకే ఆమెపై వేటు వేసి.... ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవిలో కొత్త వారిని కూర్చోబెట్టినందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుందట. ఈ నేపథ్యంలోనే చాలామంది ఆశావాహుల నుంచి.. దరఖాస్తులు కూడా స్వీకరించినట్లు తెలుస్తోంది. కొంతమంది ఢిల్లీకి వెళ్లి కూడా తమ  డిమాండ్ ను వినిపిస్తున్నారట ఏపీ బీజేపీ నేతలు.

 

ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఇలా చాలామంది నేతలు... రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా బిజెపి చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇంతలోనే... సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఇతర పైకి వచ్చింది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి... బిజెపి పార్టీ సీనియర్ నాయకులు.


1990 ఆ కాలం నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అనుభవం సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది. ఆ తర్వాత ఏపీ బీజేపీలో కీలక పాత్ర కూడా పోషించారు. దానికి తోడు కడప వాసి కావడం ఆయనకు ప్లస్ పాయింట్. రెడ్డి సామాజిక వర్గం కావడం మరింత అడ్వాంటేజ్. ఏపీలో వైసీపీ పార్టీకి చెక్ పెట్టేందుకు సింగారెడ్డి రామచంద్రారెడ్డి కరెక్ట్ అని... బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుందట. అందుకే అతనికి సీటు ఇచ్చేందుకు.. డిసైడ్ అయిందట బిజెపి పార్టీ. ఫిబ్రవరి చివరిలో ఈ నిర్ణయం ప్రకటించబోతున్నారని... సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: