- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

కన్నయ్య లక్ష్మీనారాయణ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు .. ఎప్పుడో 1989 లోనే ఆయన ఎమ్మెల్యే అవడంతో పాటు మంత్రి కూడా అయ్యారు .. ఓట‌మి లేకుండా ఐదు సార్లు వరుస విజయాలు సాధించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా 10 ఏళ్ల పాటు కన్నా చక్రం తిప్పారు .. ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లారు అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన సక్సెస్ అవలేదు .. గత ఏడాది ఎన్నికలకు ముందు టిడిపి తీర్థం పుచ్చుకొని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు .. అలాంటి కన్నా నాలుగు మాసాల నుంచి ఎక్కడా కనిపించడం లేదు .


 చంద్రబాబు ఏరి కోరి ఆయనను పిలిచి మరి పసుపు కండువా కప్పి సత్తెనపల్లి సీటు ఇచ్చారు .. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలిచిన తర్వాత కూడా కన్నా ఎక్కడా కనిపించడం లేదు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది .. తర్వాత వ్యక్తిత సమస్యలతో నియోజకవర్గానికి దూరం పాటిస్తున్నారని చర్చలు కూడా వినిపించాయి .. కీలకమైన అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా పార్టీ కార్యక్రమాల వరకు కన్నా ఎక్కడా కనిపించడం లేదు .. దీనికి మరో కారణం ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలలోనే ప్రచారం నడుస్తోంది .. కన్నా మంత్రి పదవి ఆశించారని చంద్రబాబు ఇవ్వకపోవడంతో కన్నా అలిగినట్టు కొనేళ్లుగా చర్చల్లో ఉంది . తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.


సత్తెనపల్లి టిక్కెట్ ఆశించిన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణతో కన్నా విభేదించారు అన్నది అందరికీ తెలిసిందే .. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే బాగా ఉందని ఇప్పుడు ఇద్దరికి సఖ్యత లేకపోవడంతో కన్నా పరిస్థితి కుడితిలో పడిన మాద‌రి అయింద‌ని అంటున్నారు. కన్నా గెలిచిన తర్వాత వ్యక్తిగత వ్యాపార విభేదాలు ఇద్దరి మధ్య మొదలయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి . అధిష్టానం సీరియస్ అయిందని ఇద్దరిని పిలిచి మందలించిందని అంటున్నారు .. కోడెల పరిస్థితి ఎలా ఉన్నా కన్నా మాత్రం అధిష్టానం మందలింపు పై బాగా హర్ట్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి . తనకు మంత్రి పదవి ఇవ్వకపోగా నియోజకవర్గంలో తనకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆరోపిస్తున్నారట . ఈ నేపథ్యంలోని పార్టీకి చాలా దూరం దూరంగా ఉంటున్నారని టిడిపి వర్గాల మధ్య జరుగుతున్న చర్చ.

మరింత సమాచారం తెలుసుకోండి: