మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఏమయ్యారు .. ఆయన ఎక్కడ ఉన్నారు అన్నది ఎవరికీ అంతుపడటం లేదు .. రెండు నెలల కిందట ఆయన అనుహింగా మీడియా ముందుకు వచ్చి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు .. వాస్తవానికి అవంతి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం 2009 లో ప్రజారాజ్యంతో ప్రారంభమైంది ఆ ఎన్నికలలో భీమిళీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి అనకాపల్లి ఎంపీగా గెలిచారు ,, ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లి మళ్లీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసిపి ప్రభుత్వం లో మంత్రిగా కూడా పనిచేశారు .
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి భీమిలిలో గంటా శ్రీనివాసరావు పై పోటీ చేసి ఏకంగా 95 వేల కోట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు .. వైసిపి ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన అవంతి వైసీపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించి జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆ పార్టీకి దూరమయ్యారు .. ఈ క్రమంలోనే అవంతి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలలో ఉన్నట్టు తెలుస్తోంది .. ఆయన త్వరలోనే ఒక పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు .. అయితే ఆ పార్టీ ఏంటి అనేది ఆసక్తిగా మారింది . అయితే ఈ విషయంలో అవంతి క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం ..
రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చలను బట్టి జనసేన వైపు అవంతి చూస్తున్నారు .. గతంలో ప్రజారాజ్యం పార్టీతో ఉన్న అనుబంధం ఇటీవల వైసిపి నుంచి బయటకు వచ్చిన వ్యాపారం నేపథ్యంలో ఆయన చిరంజీవి పై ప్రశంసలు కురిపించారు .. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్ చూపు జనసేన వైపు ఉందన్న చర్చ నడుస్తోంది .. ఈ విషయంలో ఆ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు .. మరోవైపు అవంతి కాలేజీలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉన్నాయి .. వీటిని సాధించుకునేందుకు అవంతి ఇలా రాజకీయాలు చేస్తున్నారన్న చర్చలు కూడా కూటమి పార్టీల మధ్య నడుస్తోంది .. మరి అవంతి జనసేన కండువా కప్పుకుంటారా లేదా అన్నది చూడాలి .