తనపై వచ్చిన ఆరోపణలను స్పందిస్తు 2001లోనే తాము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశామని.. 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అవుతుందని రాశారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలియవా..19.11.1981 లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ తమకు అమ్మిన వారికి ఆర్డర్లు ఇచ్చారని తెలియజేశారు. అధునాతన గెస్ట్ హౌస్లు కూడా కట్టుకున్నామని రాశారు. 2001 లోనే అక్కడ పనిచేసే వారి కోసం తాము ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నామని వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిడిపికి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు కూడా చేశారని తెలియజేశారు.
ఆరోజు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి అక్కడ ఎలాంటి అక్రమన కూడా లేదని తెలియజేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అయ్యాక మళ్లీ ఫిర్యాదు చేస్తే అప్పుడు కూడా అక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలియజేశారు. కోర్టులో పిటిషన్ వేసిన కూడా ఆ పిటిషన్ కోర్టు తోసి బుచ్చిందని తెలియజేశారు పెద్దిరెడ్డి. 1968 లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్లో కూడా ఆ 76 ఎకరాలు కూడా వారికి సంబంధం లేదంటూ తేల్చారని దానిని కూడా ఇన్వాల్వ్ రైట్స్ ఆఫ్ 27.6.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు సైతం కేంద్రం కూడా అనుమతులు ఇచ్చారని తెలిపారు.. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ కూడా తందానా అంటున్నారు అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఇసుక మింగేసారని, ఎర్రచందనం దొరికింది అంటూ ఇలా ఏవేవో కట్టు కథలు చెప్పారు.. ఈరోజు ఉపముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు.