ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టడం గమనార్హం. మంత్రి నారా లోకేశ్ ఈ సేవలను ప్రారంభించడం జరిగింది. "95523 00009" నంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఎన్నో ప్రభుత్వ సేవలను సులువుగా పొందే అవకాశం అయితే ఉంది. ఈ వాట్సాప్ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
 
పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయడానికి వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొనిరావడం గమనార్హం. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుందని సమాచారం అందుతోంది. రెండో విడతలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
తొలి విడతలో భాగంగా దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ ఆర్టీసీ, రెవిన్యూ, మున్సిపల్ ఇతర శాఖలలో ఈ సేవలు మొదలుకానున్నాయని తెలుస్తోంది. పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ విధానం అందుబాటులోకి రానుందని సమాచారం అందుతోంది. ఈ వాట్సాప్ నంబర్ ద్వారా దేవాలయాలలో దర్శనాల స్లాట్లు, వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి కూడా చేయొచ్చని సమాచారం అందుతోంది.
 
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నో ఎర్నింగ్ ఇలా ఇతర సర్టిఫికెట్లను సైతం వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ ను సైతం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కరెంట్ బిల్లులు, ఆస్తి పన్నులు ఈ వాట్సాప్ ద్వారా చెల్లించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన వేర్వేరు సేవలను సైతం వాట్సాప్ ద్వారా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఏపీ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: