ఈ జంట పెట్టబోయే వస్త్ర దుకాణానికి కాంచీపురం సిల్క్ అనే పేరు కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ తో పాటుగా ఏపీలో విజయవాడ విశాఖపట్నం వంటి మెట్రో నగరాలలో ప్రాంతాలలో కూడా ఈ మాల్స్ ను ప్రారంభించబోతున్నారట. ఈ వ్యాపారం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఈ జంట. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంతో కథ కొన్ని నెలలుగా తమ వ్యాపారానికి అవసరమయ్యే డబ్బులను కూడా సమకూర్చుకుంటూ ఉన్నారట. గత కొద్దిరోజులుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్న ఈ జంట ఫోటోలు కేవలం వ్యాపారం కోసమే తాము తిరుగుతున్నాము అన్నట్లుగా తెలుపుతున్నారట.
దివ్వెల మాధురికి కూడా ముందు నుంచి చీరలు కలెక్షన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని ఇప్పటికే తన దగ్గర చాలా విలువైన పట్టు చీరలు కూడా ఉన్నాయట. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందని.. అందుకే ఈ వ్యాపారంలో ఎటువంటి డోకా ఉండదని ధీమాతో వీరు పెద్దపెద్ద నగరాలలో చీరల వ్యాపారం సెట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దువ్వాడ రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక పోవడంతో ఇలా బిజినెస్ వైపుగా అడుగులు వేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.