ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వంలో.. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఈ మధ్యకాలంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ... అతన్ని కాదని నారా లోకేష్ కు పదవి బాధ్యతలు ఇవ్వాలని.. టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు కూడా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.

 

అటు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే.... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమకు కూడా కోరికలు ఉంటాయ.... అందుకే ఆంధ్రప్రదేశ్ సీఎంగా పవన్ కళ్యాణ్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు.  దీంతో జనసేన వర్సెస్ టిడిపి మధ్య... కాస్త గ్యాప్ పెరిగినట్లు అయింది. అయినప్పటికీ... ఒక మెట్టు దిగివచ్చిన పవన్ కళ్యాణ్.... జనసేన నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

 

ఎవరు కూడా... తనకు సీఎం పదవి కావాలనే విషయాన్ని మాట్లాడకూడదని చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ ఈ విషయంపై టిడిపి పార్టీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన విడుదల చేయలేదు. కేవలం వాట్సాప్ గ్రూపులో మాత్రమే టిడిపి స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఈ లెక్కన... నారా లోకేష్ కు త్వరలోనే కీలక పదవి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. లేదా టిడిపి అధ్యక్ష పదవి నారా లోకేష్  కు వస్తుందని అంటున్నారు.


 

అది కాకపోతే డిప్యూటీ సీఎం లేదా నేరుగా సీఎంగా  నారా లోకేష్ ను ప్రాజెక్ట్ చేసే ఛాన్సులు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే... పవన్ కళ్యాణ్ పార్టీకి ఊహించని ఎదురి దెబ్బ తగిలి ఛాన్స్ ఉంది. తనకంటే చిన్న అలాగే కూటమి విజయానికి కారణమైన తనను కాదని...నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం, లేదా సీఎం పదవి ఇస్తే.. పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు... చాలా వ్యూహాత్మకంగా  ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: