కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే తాము చెప్పిన హామీలను సైతం నెరవేర్చడానికి డబ్బులు లేవంటూ తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాజాగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ ఉత్తరులను జారీ చేశారు.. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపటి రోజు నుంచి పెంచిన విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది.


అర్బన్, రూరల్ వంటి ప్రాంతాలలో భారీగానే పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. భూముల విలువలతో పాటుగా నిర్మాణ విలువలు కూడా పెంచినట్లు సమాచారం. హామీలను సైతం అమలు చేయకుండా ప్రజల పైన పెను బారాలను మోపే విధంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే 15 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల  జనం మీద వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్న ఇప్పుడు తాజాగా స్థిరాస్తి విలువలను సైతం అమాంతం పెంచేందుకు ఒక జీవోను కూడా తీసుకోవచ్చారట. రేకుల షెడ్లు, పూరి గుడిసెలు పెంకుటీల్లు, గోడలు లేని ఇల్లు విలువలను కూడా పెంచేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తరలను జారీ చేసిందట.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తగ్గిపోయింది. దీంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు కూడా తగ్గుముఖం పట్టాయి.అలా రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గండిపడడం జరిగింది. గత ప్రభుత్వంలో పదివేల కోట్లు ఉన్న ఆదాయం ఇప్పుడు 6000 కోట్లకు పడిపోయిందట. అందుకే ఎలాగైనా ఆదాయాన్ని పెంచాలి అని భావించిన కూటమి సర్కర్ మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తున్నదట. ఇలా సవరించిన భారం మొత్తం కూడా ప్రజలపైనే మోపేల చూస్తోంది పట్టణ గ్రామీణ ప్రాంతాలలో భూముల విలువలను సైతం కేటగిరి వారిగా పెంచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలలో పెరుగుదల అపరిమితంగా ఉంటుంది అని తెలుపుతున్నారు. అపార్ట్మెంట్ భవనాల విలువలు కూడా భారీగాని పెరగబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: