జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, టీడీపీ పార్టీ అగ్ర నాయకులు నారా లోకేష్ తప్పుకోనున్నారట. ఒకవేళ ఇదే... జరిగితే.. నారా లోకేష్ స్థానంలో... జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని నందమూరి బాలయ్యకు ఇవ్వనున్నారట చంద్రబాబు. ఈ మేరకు రంగం సిద్ధం చేశారట సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కూడా జరుగనుంది.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు. గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు మార్పులు తప్పవని ఇప్పటికే ఓపెన్ గా ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, టీడీపీ పార్టీ అగ్ర నాయకులు నారా లోకేష్. అటు మూడు సార్లు మించి పార్టీ పదవులు ఉండకూడదని నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించేశారు.
తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని వెల్లడించారు నారా లోకేష్. దీంతో పొలిట్ బ్యూరో మార్పులు చేర్పులు పై చర్చ ఇవాళ జరుగనుంది. దీంతో పొలిట్ బ్యురో కు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సభ్యత్వం కోటి దాటడం తో ప్రత్యేక చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యే లు మంత్రులు జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు. పార్టీసంస్థాగత నిర్మాణం పై చర్చ ఉంది. పొలిట్ బ్యూరో లో కొత్తవారికి యువకులకు అవకాశం అనే చర్చ జరుగుతోంది. అటు నారా లోకేష్ స్థానంలో... జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని నందమూరి బాలయ్యకు ఇవ్వనున్నారట