అయితే ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరు అనే విషయం పైన కూడా చర్చలు జరుగుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈనెల 8వ తేదీన విశాఖ కు నరేంద్ర మోడీ రావడంతో అటు చంద్రబాబు పవన్ మోడీ తో పాటు లోకేష్ ఫ్లెక్సీలు కూడా కనిపించడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం లోకేష్ అనే ఒక స్లాగ్ ఒక వారం రోజులపాటు జరిగింది. దీంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అలర్ట్ అయి ఈ విషయాలకు చెక్ పెట్టారు.
ప్రస్తుతం కూటమిలో అసలు సీఎం డిప్యూటీ సీఎం అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కూటమికి ఎమోషనల్ స్ట్రెంత్ అని చెప్పవచ్చు. టిడిపి నేతలు లోకేష్ ని సీఎంగా చూడాలని చాలా పట్టుదలతో ఉన్నారు. మొత్తం మీద ఈ పార్టీలో బలం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అయితే నెంబర్ ఉంటే సరిపోతుందా పొత్తులో మిగిలిన పార్టీలు కూడా కలిసి రావాలి కదా అనే అంశం తెర మీదకి వచ్చిందట. పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే సీఎం కావాలి అంటే ఒకటి వచ్చే ఎన్నికలలో పొత్తు లేకుండా పోటీ చేయాలి లేకపోతే పొత్తులో ఉంటూనే భారీ సంఖ్యలో సీట్లు తీసుకోవాల్సి ఉంటుంది. 2024 ఎన్నికలలో అయితే పవన్ కి చాలా హైపు గానే ఉన్నది.
ఈ ప్రకారం చూస్తే 2029లో టిడిపి పార్టీనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ నే సీఎంగా నియమించేలా చూసుకోవాలి.. లేకపోతే సింగల్ గా పోటీ చేసి ఎవరి స్టామినా ఎంత ఉందో నిరూపించుకోవాలి. మరి మొత్తానికి 2029 లో ఏం చేస్తారో చూడాలి.