జమలి ఎన్నికలు వస్తే చంద్రబాబుకు నష్టం అందుకే ఆయన ఎన్నికలకు ఒప్పుకోరు అని కూడా తెలియజేశారు. జెమిలి ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలాంటి నష్టము లేదని చింతామోహన్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలలో తిరగడం లేదు హైదరాబాదులో కూర్చుంటే పనులు కూడా జరగడం లేదు.. ప్రస్తుతం అందరూ కూడా ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతున్నదని.. గెలవాలి అంటే కచ్చితంగా ప్రజలలోకి వెళ్లి చాలా కష్టపడాలని తెలియజేశారు.
ముఖ్యంగా దళితుల పైన అంటరాని వారి పైన కూడా చాలా వివక్షత ఉండేది.. దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా చాలా మంది వెనుకాడేవారు అని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరాని తరం కూడా మారిపోయిందని.. ఎస్సీలకు 15% ఇచ్చిన ఘనత అంబేద్కర్కిది కాగ వాటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ తెలిపారు. కానీ ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చిన తీర్పులో లోపాలు కూడా ఉన్నాయని పక్క రాష్ట్రాలలో అమలు కానటువంటి వాటిని ఏపీలో చంద్రబాబు అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఏక సభ్య కమిటీ పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నాలను సైతం ఆపాలి అంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ తెలియజేశారు. మొత్తానికి జమిలి ఎన్నికల వల్ల చంద్రబాబు భయపడుతున్నారని విషయాన్ని చెప్పగానే చెప్పేశారు..