మరోవైపు బడ్జెట్ ప్రతిపాదన వచ్చిన ప్రతిసారీ ఆదాయపు పన్ను ఊరట కల్పిస్తారంటూ వేతన జీవుల ఆశగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో ఈసారి మార్పులు ఉండొచ్చన్న అంచనాలు కూడా లేకపోలేదు. కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణ, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, రిబేట్ పెంపు వంటి అంశాలపై ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఒకవేళ బడ్జెట్‌లో ప్రతిఫలిస్తే మధ్యతరగతికి వారికి ఇది పెద్ద శుభవార్తే అవుతుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పథకాలు ఈసారి బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందన్న విశ్లేషకులు భావిస్తున్నారు.
అవును... మహిళలకు నైపుణ్య శిక్షణ కల్పించండంతో పాటు జన్‌ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలు కేటాయింపులు పెంచడం వంటివి ఎక్కువగా చేయొచ్చని అంతా అనుకుంటున్నారు. పేదలకు సంబంధించి ఇప్పటికే ఉచిత ఆహార ధాన్యాలు, పీఎంఏవై, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి పథకాలు అమలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని కేటాయింపులు పెంచడంతో పాటు సామాజిక భద్రతను మరింత విస్తరించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఇన్ని అంచనాల నడుమ ప్రధాని మోదీ వ్యాఖ్యలు బడ్జెట్‌లో ప్రతిబింబిస్తాయా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది.