కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రకటనకు ముందు కొన్ని రకాల హింట్లు ఇస్తూ ఉంటారు. ఎప్పటిలాగానే నిర్మల సీతారామన్ ఈసారి కూడా బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నారు. ముఖ్యంగా పలు రకాల రంగాలకు సంబంధించి చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఆశతో ఎదురుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రోత్సహించాలని కూడా రైతులు చాలా ఎదురు చూస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే వీటి మీద ఈసారి పరిమితి పెంచబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మల సీతారామ బడ్జెట్ ప్రసంగం రేపటి రోజున కాబోతోంది. ఇందులో రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణ మధ్య ప్రగతి నుంచి వ్యాపారవేత్తల వరకు కూడా చాలామంది ఈ బడ్జెట్ పైన ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి రైతులకు కూడా ఈసారి భారీగానే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.3 నుంచి రూ .5 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నదట..


ప్రస్తుతం కిసాన్ కార్డు రైతులకు రూ.3లక్షల రుణ పరిమితి మాత్రమే ఇస్తున్నది. వీటిని రూ .5లక్షలకు పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయట. కేసీసీ పథకం కింద కూడా 9% వడ్డీ రేటు తో రుణాలు రైతులు పొందేలా చూస్తారట. వీటిపైన 2% ప్రభుత్వం రాగితే ఇవ్వగా.. సరిగ్గా కట్టే వారికి 3% రాయితీ ఇస్తున్నారట.1998లో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చిందట. పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలను కూడా అందరిని ఆకర్షించే విధంగా ఉంటాయట.. ప్రతి ఏడాది కిసాన్ సన్మానిధి యోజన కింద ప్రతి ఏడాది 6000 రూపాయలను సైతం 2000 చొప్పున మూడు విడతలుగా ఇస్తున్నారు. అయితే వీటిని కూడా పెంచే ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రైతులకు ఏ విధమైనటువంటి గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: