కాంగ్రెస్ ప్రభుత్వం పై... చాలా రోజుల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు... తన గళం విప్పారు. తాను కొడితే మామూలుగా ఉండదని... సినిమా డైలాగులతో రెచ్చిపోయారు కేసీఆర్. ఇవాళ తన ఫామ్ హౌస్ లో.. మెదక్, సంగారెడ్డి అలాగే జహీరాబాద్ ప్రాంతాలకు సంబంధించిన గులాబీ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


నేను కొడితే మాములుగా ఉండదని తెలిపారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు కేసీఆర్.  రానున్న రోజు ల్లో కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారంటూ చురకలాంటించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ శాతం  వచ్చిందని నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ గురించి.. గుర్తు చేశారు.

 కాంగ్రెస్ నిర్వహించిన పోలో గులాబీ పార్టీకి 70% వచ్చిందని... కాంగ్రెస్ పార్టీకి 30% వచ్చిందని సెటైర్లు పేల్చారు కేసీఆర్.  నేను చెప్పిన ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారని పేర్కొన్నారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను అంటే గుర్తు చేశారు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్.  తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారని...రాబోయే రోజుల్లో విజయం మనదే అన్నారు.
మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని స్పష్టం చేశారు కేసీఆర్.

ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి...భూముల ధరలు అమాంతం పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్.  చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయిందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే అని...ప్రాణం పోయిన సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకి రక్షణ మనమే అని పేర్కొన్నారు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr