కేంద్ర బడ్జెట్ 2025 -2026 రేపు ప్రవేశపెట్టబోతున్నారు. లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా నరేంద్ర మోడీ మూడవ ప్రభుత్వం లో కూడా ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె శనివారం ఉదయం 11 గంటల సమయంలో... కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది.

 

ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం మళ్లీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అలాగే విశాఖ మరియు విజయవాడలో మెట్రో ట్రైన్ ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టులకు 100% నిధులు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్లో సాధ్యమవుతుందా అనేది చూడాలి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. గత ఆర్థిక బడ్జెట్లో.. ఏపీకి భారీగానే నిధులు కేటాయించింది కేంద్రం.

 

ఇక ఇటు.. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున నిధులు కేటాయించాలని మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ! అయితే అప్పులు అయ్యాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు బంధు  పథకాల కోసం... తెలంగాణకు ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తే... బాగుంటుందని అంటున్నారు.

 అలాగే ఇతర రాష్ట్రాల  కు కూడా  నిధులు సమస్తాయిలో ప్రకటించాలని డిమాండ్లు.. వినిపిస్తున్నాయి. ఉత్తరభారతం అలాగే దక్షిణ భారతం... అని తేడా లేకుండా అందరికీ సమానంగా నిధులు ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫున రైతులను ఆదుకునేలా ప్యాకేజీ ప్రకటించాలని.. అంటున్నారు. పీఎం కిసాన్  కింద నిధులు అత్యధికంగా కేటాయించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: